హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. | Rain Fall Update In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..

Apr 20 2021 7:01 PM | Updated on Apr 20 2021 7:10 PM

Rain Fall Update In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోఈరోజు సాయంత్రం (మంగళవారం) ఆకాశం మేఘావృతమై పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. కూకట్‌పల్లి, ఉప్పల్‌, రామాంతాపూర్‌, మేడిపల్లిలో చిరుజల్లులు కురిశాయి. అదేవిధంగా, దిల్‌సుఖ్‌ నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్‌నగర్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అక్కడక్కడ ఈదురు గాలులు, చిన్నపాటి మెరుపులతో వర్షంపడింది. దాంతో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇ‍బ్బంది పడ్డ నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement