శంకర్‌ పల్లికి భారీగా పెట్టుబడులు

Railway Coach Foundation Stone Laid at Kondakal - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి  బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘జిల్లాకు రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్‌వేర్‌ కంపెనీలకు నెలవుగా మారనుంది. నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లోనూ ఘనత సాధించింది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, హార్డ్‌వేర్‌ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా రంగారెడ్డి జిల్లా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి  చూపిస్తున్నారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమ రైలు కోచ్‌లు, డీజిల్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్‌ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో తమ యూనిట్‌ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్‌ఐఐసీ వంద ఎకరాల భూ సేకరణ చేపట్టింది’ అని తెలిపారు.

చదవండి: సోషల్‌ మీడియా పోస్టు; గీత దాటితే చర్యలు తప్పవు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top