షాకింగ్‌ సీన్‌.. కల్తీ సమోసాలు.. కుళ్లిన గుడ్లతో పఫ్స్‌.. | Raids On Adulterated Samosa Manufacturing Unit In Jiyaguda | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ సీన్‌.. కల్తీ సమోసాలు.. కుళ్లిన గుడ్లతో పఫ్స్‌..

Mar 21 2026 1:30 PM | Updated on Mar 21 2026 1:49 PM

Raids On Adulterated Samosa Manufacturing Unit In Jiyaguda

సాక్షి, హైదరాబాద్‌: జియాగూడలో కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌ H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ట్రేడ్‌ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్లు నిర్థారించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్‌ చేశారు.

నిందితుడు అబ్దుల్ రషీద్.. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాల్లో  కల్తీ ఆహారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement