
హైదరాబాద్: రేషన్ షాపులో సరుకులు తీసుకునేందుకు వచ్చినవారు కాదు వీరంతా. బంగారం కొనేందుకు వీరు ఇలా బారులు తీరారు. పసిడి 10 గ్రాముల ధర రూ.లక్ష దాటి పరుగులు తీస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గలేదనడానికి ఈ క్యూలైన్ చూస్తేనే తెలుస్తోంది. శనివారం అఫ్జల్‌గంజ్‌లోని ఓ జ్యువెలరీ షాపు ముందు బంగారం కొనుగోలు చేసేందుకు నగర వాసులు ఇలా క్యూ కట్టిన చిత్రం కనిపించింది.