
స్వాధీనం చేసుకున్న నగదు
సాక్షి, వరంగల్: సరైన పత్రాలు లేకపోవడంతో వరంగల్ శివనగర్‌లో అరటి పండ్ల వ్యాపారి కొవ్వూరి మధు సూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.07 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్, మధు వివరాలను సోమవారం వెల్లడించారు. మధుసూ దన్‌రెడ్డికి సంబంధించి అరటి పండ్ల డీసీఎం మదనపల్లి నుంచి వరంగల్‌కు ఆదివారం అర్ధరాత్రి బయలుదేరగా, అందులో పెద్ద మొత్తంలో సరైన పత్రాలు లేని నగదు తీసుకొస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం ఉదయం మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ వద్ద డీసీఎంను ఆపి తనిఖీ చేయగా డబ్బు లభించలేదు. ఆ తర్వాత శివనగర్‌లోని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా రూ.1.07 కోట్ల నగదు దొరకగా, సరైన పత్రాలు అడిగితే చూపించలేదు. దీంతో నగదును సీజ్ చేశామని వెల్లడించారు. కాగా, జిల్లా కేంద్రంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడడం సంచలనం కలిగించింది.