👉కొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రం
- దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
- కొరత వదంతులను కొట్టిపారేసిన కేంద్రం
👉డిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాం: స్టీఫెన్ రవీంద్ర
- తెలంగాణలో మొత్తం పెట్రోల్ బంకులు 4321
- సాధారణంగా 5883 కిలో లీటర్ల పెట్రోల్ అవసరం
- నిన్న ఒక్కరోజు పెట్రోల్ 10,799.5 కిలో లీటర్ల విక్రయం
- నిన్న ఒక్కరోజు 84 శాతం పెట్రోల్ అధికంగా విక్రయం
- సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
- 13,231 కిలో లీటర్ల డీజిల్ ప్రతినిత్యం సాధారణంగా అవసరం
- నిన్న ఒక్కరోజు 22,127 కిలో లీటర్ల డీజిల్ విక్రయం
- 2173 డీజిల్ ట్యాంకర్లు ఉన్నాయి
- 1056 పెట్రోల్ ట్యాంకర్లు ఉన్నాయి
- ఎల్‌పీజీ డొమెస్టిక్ 1.28 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి, కమర్షియల్ 63,550 కనెక్షన్లు ఉన్నాయి
- డిమాండ్ కంటే సప్లై ఎక్కువ చేస్తున్నాం
- పైప్ న్యాచురల్ గ్యాస్ లో లక్షా మూడు వేల 275 కనెక్షన్లు ఉన్నాయి
- సీఎన్‌జీ స్టేషన్లు 225 ఉన్నాయి..
- PNG, CNG expansion చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం
- సప్లై చైన్ లో ఇబ్బంది లేకుండా చర్యలు
అడ్డగోలుగా పెట్రోల్ ధరలు
👉 సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్ లో పెట్రోల్ బంకుల్లో పెరిగిన పెట్రోల్ ధరలు
ఓ బంకులో ఏకంగా లీటర్ పెట్రోల్ కు ఐదు రూపాయలకు పైగానే వడ్డన
అదేంటని ప్రశ్నించిన వినియోగదారులకు సమాధానం చెప్పని బంకు నిర్వాహకులు
👉పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలు కట్టారు. ప్రజలు భయాందోళన చెందడంతోనే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
అందువల్లే నో స్టాక్ బోర్డులు
👉 విజయవాడ: ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ డీలర్స్, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
అడ్వాన్స్ లు చెల్లించినా సరఫరా నిలిపివేస్తున్నారంటున్న డీలర్లు
అందువల్లే నో స్టాక్ బోర్డు పెడుతున్నామన్న పెట్రో డీలర్ల ఫెడరేషన్
సడెన్ గా ఇండెంట్ క్యాన్సిల్ చేయడంతోనే సమస్య వస్తోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫెడరేషన్
ఏపీ వ్యాప్తంగా 5 వేల పెట్రోల్ బంకులు
ట్యాంకర్లను తామే స్వయంగా పర్యవేక్షిస్తామన్న అధికారులు
ఈరోజు సాయంత్రంలోగా లాగిన్ యాక్సిస్ ప్రభుత్వానికి ఇవ్వాలని ఓఎంసీలకు ఆదేశం
గుంటూరులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు
👉 గుంటూరు సిటీలో పెట్రోల్ లేక మూతపడుతున్న పెట్రోల్ బంకులు
నగరంలో పెట్రోల్ లేక మూతపడ్డ 8 పెట్రోల్ బంకులు
పెట్రోల్ ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం బారులు తీరిన జనం
ప్రభుత్వం అంతా బానే ఉంది అని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని మండిపడుతున్న ప్రజలు
ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదు నూనె ధరలు పెరిగాయి ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ఆగ్రహిస్తున్న ప్రజలు
👉కృష్ణాజిల్లా: గుడివాడ పట్టణంలో పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. బంక్‌ల వద్ద నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు సిటీలో పెట్రోల్ లేక బంక్‌లు మూతపడుతున్నాయి. నగరంలో 8 పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. పెట్రోల్ కోసం జనం బారులు తీరారు. ప్రభుత్వం అంతా బానే ఉందని చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దారుణంగా ఉందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదని.. నూనె ధరలు పెరిగాయని.. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


