వాట్‌ యాన్‌ ఐడియా.. లారీ కాదండోయ్‌.. ఫైవ్‌ స్టార్‌ స్టైల్‌ హోటల్‌!

Nalgonda: Lorry Made Into Five Star Look Hotel In Kodad - Sakshi

సాక్షి, కోదాడరూరల్‌(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్‌స్టార్‌ లుక్‌లో హోటల్‌గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్‌ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేసి హోటల్‌గా మార్చారు. దానిని హైదరాబాద్‌ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్‌రోడ్‌లో శనివారం ప్రారంభించారు.


ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్‌ ఫుడ్‌తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్‌ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్‌ రహదారిపై వచ్చిపోయే  ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్‌ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్‌ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top