ఔషధ రంగంలో డీఎఫ్‌ఈ ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’

Minister KTR Inaugurated The Center Of Excellence In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన డీఎఫ్‌ఈ ఫార్మా హైదరాబా­ద్‌లో కొత్తగా ‘క్లోజర్‌ టు ది ఫార్ములేటర్‌’ (సీ2ఎఫ్‌) పేరిట నైపుణ్య కేంద్రాన్ని (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు.

జీనోమ్‌ వ్యాలీ సహకారంతో సీ2ఎఫ్‌ మరింత బలోపేతమై అభివృద్ధి చెందుతుందని కేటీఆర్‌ అన్నారు. ఔషధాల అభివృద్ధిలో నూతన ఆలోచనలు వాణిజ్య ఉత్పత్తి రూపాన్ని సంతరించుకునేందుకు పట్టే సమయాన్ని సీ2ఎఫ్‌ తగ్గిస్తుంది. సీ2ఎఫ్‌ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్ర­మ­ల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైఫ్‌­సైన్సెస్, ఫార్మా డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, డీఎఫ్‌ఈ ఫా­ర్మా సీఈవో మార్టి హెడ్మన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top