మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

Metro Trains Stopped Due To Technical Issues In Nagole - Sakshi

అంతటా ఆగిన మెట్రో రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలుసార్లు మెట్రో రైళ్లు అర్ధాంతరంగా నిలిచిపోగా తాజాగా మరోసారి ముందుకు కదలకుండా మొరాయించాయి. మంగళవారం నాగోల్‌ స్టేషన్‌ డేటా కంట్రోల్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అన్ని మెట్రో రూట్లలో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మియాపూర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వైపు వెళ్తున్న రైలులోనూ సాంకేతిక లోపం తలెత్తగా గాంధీభవన్‌ స్టేషన్‌లో మెట్రో నిలిచిపోయింది. మరోవైపు ముసారాంబాగ్‌లోనూ గడిచిన 15 నిమిషాలుగా మెట్రో సేవలు ఆగిపోయాయి. (చదవండి: ఐటీ ఉద్యోగులు స్కై వాక్‌ చేస్తూ ఆఫీస్‌లకు..)

వీలైనంత త్వరగా రైళ్లను పునరుద్ధరించేందు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 21న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5 వద్ద మెట్రో రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్‌ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రో రైల్‌కు బ్రేకులు వేస్తున్నాయి.  (చదవండి: ‘కూ యాప్‌’కు తెలుగువారి ఆదరణ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top