Anusha: ఇప్పటికే మూడు సర్జరీలు.. బాధను తట్టుకోలేక..

Married woman Commits Suicide With Health issues in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య సమస్యలతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డి న ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ వివ రాల ప్రకారం.. కూకట్‌పల్లి మైత్రినగర్‌లో నివాసముంటున్న ప్రకాశం జిల్లా తాండూరుకు చెందిన శివారెడ్డి, రాయచూర్‌కు చెందిన హులిగమ్మ అలియాస్‌ అనూష (27)తో పరిచయం ఏర్పడి ప్రేమ గా మారింది. 2018లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. హులిగమ్మ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యో గం చేస్తోంది.

కాగా శివారెడ్డి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఓ శుభకార్యం నేపథ్యంలో శివారెడ్డి వెళ్లగా హులిగమ్మ శివారెడ్డికి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని అడగగా అతడు రాలేదు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన శివారెడ్డి గడియ కొట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి గడియ పగల గొట్టి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.

వెంటనే శివారెడ్డి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారణాలు సేకరించగా ఆమెకు ఇప్పటికే మూడు సర్జరీలు జరిగాయని, బాధను తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని శివారెడ్డి పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (తల్లి వివాహేతర సంబంధం.. సమాజంలో తలెత్తుకుని తిరగలేమని..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top