అడవి తగలబడుతోంది..ఆర్పేవారేరీ..

కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధి కొత్తగూడ మండలం గుంజేడు సమీపంలో కార్చిచ్చుకు వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమవుతోంది. నిత్యం అటవీ శాఖాధికారులు సంచరించే ప్రధాన రహదారి మొత్తం పొగ కమ్ముకుని మంటలు ఎగిసి పడుతున్నాయి.
మూడు రోజులుగా మంటలు ఎగసి పడుతున్నాయని పశువుల కాపర్లు తెలిపారు. అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రత్యేక పరికరాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తునికాకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడవుల దహనానికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.