ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు?   | LRS Deadline May Be Extension | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు?  

Oct 15 2020 8:03 AM | Updated on Oct 15 2020 8:03 AM

LRS Deadline May Be Extension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లేఔట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే మరో నెల రోజులపాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మీ–సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బుధవారం రాత్రి నాటికి మొత్తం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల్లో 6,67,693, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్లలో 2,91,066 దరఖాస్తులొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement