సమస్యలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మె | Lightning strike if problems are not resolved | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మె

Apr 7 2026 4:34 AM | Updated on Apr 7 2026 4:34 AM

Lightning strike if problems are not resolved

కుకింగ్‌ గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ హెచ్చరిక 

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): తెలంగాణలోని 600 గ్యాస్‌ ఏజెన్సీలలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వారం రోజుల్లో సమ్మె చేస్తామని తెలంగాణ కుకింగ్‌ గ్యాస్‌ డెలివరీ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చ రించారు. సోమవారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా సజావుగా అందించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూ టర్స్, డీలర్స్‌ వ్యవహరిస్తున్నారని అన్నారు. 

డెలివరీ బాయ్స్‌తో అక్రమంగా రీఫిల్లింగ్‌ సిలిండర్లు సరఫరా చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు డెలివరీ బాయ్స్‌ని అరెస్టు చేస్తూ యాజ మాన్యాలను వదిలేస్తున్నారని ఆరోపించారు. గత 12 ఏళ్ల నుంచి గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుడికి కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యాలు జీతా లు, వసతులు కల్పించడం లేదన్నారు. సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారు లతో రివ్యూ చేయించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారు కె.వి.గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement