కేటీఆర్‌ వాహనానికి చలాన్‌.. ట్రాఫిక్‌ ఎస్‌ఐని అభినందించిన మంత్రి

KTR Praises Traffic SI And Constable For Issuing Traffic Challan On His Vehicle - Sakshi

తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన అధికారులను అభినందించిన మంత్రి కేటీఆర్ 

తన వాహనానికి విధించిన చలాన్‌ను చెల్లించిన కేటీఆర్ 

నిబంధనలు ప్రజల కైనా.. ప్రజాప్రతినిధులకైనా ఒకటే

నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే అధికారులకు అండగా ఉంటాం

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు కేటీఆర్‌. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో  తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు. 
(చదవండి: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్‌ ఫిదా: ‘పేపర్‌ వేస్తే తప్పేంటి’)

అయితే బాపు ఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్‌లకు శాలువా కప్పి కేటీఆర్‌ అభినందించిచారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్యలాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. 
(చదవండి: ట్రాఫిక్‌ చలాన్‌ ఎలా వేస్తారని సర్పంచ్‌ హల్‌చల్‌)

తన వాహనానికి విధించిన చలాన్‌ను చెల్లించారు కేటీఆర్‌. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందెందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు.

చదవండి: ఇతగాడి పెండింగ్‌ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top