లెక్క చెప్పండి!

Krishna Board is very impatient with the attitude of the Telugu states - Sakshi

ఉపనదుల నీటి ప్రవాహాల లెక్కలపై స్పందించని తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల తీరుపై కృష్ణా బోర్డు తీవ్ర అసహనం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను సమర్పిస్తున్నట్లే బేసిన్‌లోని ఉపనదుల్లో నీటి వినియోగ లెక్కలను తెలపాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది. ఉప నదుల నీటి ప్రవాహాలపై స్పష్టత ఉంటేనే నీటి కేటాయింపులు, వినియోగం లెక్కలు పారదర్శకంగా ఉంటాయని తెలిపినా రెండు రాష్ట్రాలు ఇంతవరకు వివరాలు సమర్పించలేదు.

త్రిసభ్య కమిటీ భేటీ అనివార్య కారణాలతో వాయిదా పడటంతో ఈ అంశం పై చర్చ జరగలేదు. దీంతో మరోసారి లేఖ రాయాలని బోర్డు భావిస్తోంది. దీంతోపాటే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో గత 20 ఏళ్లుగా 1989 నుంచి 2019వరకూ ఏటా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వచ్చిన వరద, వినియోగించుకున్న జలాలు, దిగువకు విడుదల చేసిన ప్రవాహాల లెక్కలు సమర్పించాలని కోరినా స్పందన రాలేదు. ఈ వివరాలిస్తే, మిగులు జలాల లెక్కలు తేల్చుతామని చెప్పినా రాష్ట్రాలు స్పందించకపోవడంతో వారం క్రితం ఈ వివరాలు కోరుతూ రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది. దీనిపైనా స్పందన లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న బోర్డు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న యోచనలో ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top