హైదరాబాద్: గతంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ సారి కేబినెట్ హోదా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దులో కీలకంగా వ్యవహరించానని పేర్కొన్నారు.
సీఏఏ చట్ట సవరణలోనూ తన వంతు పాత్ర పోషించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు కేబినెట్ పదవి ఇచ్చారని.. కేబినెట్ పదవి ఇవ్వడం కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.


