గవర్నర్ వ్యాఖ్యలు వ్యక్తిగతం: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనాపై మరింత మెరుగ్గా పని చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ వృత్తిపరంగా డాక్టర్ అని ఆమె చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వ్యక్తిగతంగా దేశ పౌరురాలిగా ఆమె సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కరోనాపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కరోనా టెస్టులు, చికిత్స విషయంలో గవర్నర్ చేసిన సూచనలు ప్రభుత్వం పాటించి ఉంటే బాగుండేదని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి