తెలంగాణలో పెట్రోల్‌, డీజీల్‌ కొరత.. కిషన్‌రెడ్డి క్లారిటీ | Kishan Reddy Clarifies On Petrol And Diesel Shortage In Telangana, Says Dont Believe In Social Media Rumours | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెట్రోల్‌, డీజీల్‌ కొరత.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Apr 29 2026 4:25 PM | Updated on Apr 29 2026 5:18 PM

Kishan Reddy Clarifies On Petrol And Diesel Shortage In Telangana

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్‌ కొరతపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజీల్‌ను ఎవరూ ఇళ్లలో నిల్వ  చేసుకోవద్దన్న కిషన్‌రెడ్డి.. చమురు నిల్వలు లేకపోతే ప్రభుత్వమే ప్రకటిస్తుందని తెలిపారు.

ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దు. పెట్రోలు ధరలు పెరుగుతాయని రాహుల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం దురదృష్టకరం. కేంద్రం ముందు చూపుతో దేశంలో చమురు కొరత లేదు. తెలంగాణలో సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ ఉంది. పానిక్‌తో ఎవరూ పెద్ద ఎత్తున పెట్రోల్‌ కొని నిల్వ చేసుకోవద్దు’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement