కీస‌ర కేసు:‌ ఏసీబీ రెండో రోజు విచార‌ణ‌

Keesara Mro Case: Second Day Of ACB Trial - Sakshi

లాకర్ల పై స్పష్టత ఇవ్వని ఎమ్మార్వో నాగరాజు

రేపు మరోసారి కస్టడీలోకి తీసుకొని విచార‌ణ‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కీస‌ర త‌హ‌శీల్దార్ నాగ‌రాజు అవినీతి కేసులో రెండో రోజు ఏసీబీ అధికారుల విచార‌ణ ముగిసింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజు, వీఆర్వో సాయిరాజ్‌తో పాటు‌ నిందితులుగా ఉన్న అంజిరెడ్డి, శ్రీనాథ్‌ల‌కు సంబంధించి అనేక విష‌యాల‌ను ఏసీబీ అధికారులు సేక‌రించారు. ఈ సంద‌ర్భంగా అంజిరెడ్డి ఇంట్లో దొరికిన భూ లావాదేవీల డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. ఈ క్ర‌మంలో కోటి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల డ‌బ్బు ఎవ‌రివి అన్న‌దానిపై పూర్తి వివ‌రాలు రాబ‌ట్టినన‌ట్లు స‌మాచారం.

ఎమ్మార్వో నాగ‌రాజు మాత్రం ఏసీబీ అధికారుల‌కు స‌హ‌క‌రించన‌ట్లు తెలుస్తోంది. తాజా విచార‌ణ‌లో సైతం ఆయ‌న‌ బ్యాంకు లాక‌ర్ల‌పై ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. విచార‌ణ అనంత‌రం ఈ కేసులో న‌లుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రేపు మ‌రోసారి క‌స్ట‌డీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించ‌నున్నారు. (చ‌ద‌వండి1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top