
శ్రీరాంపూర్/సాక్షి, హైదరాబాద్: హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్)కు సింగరేణిలో అనుబంధ సంస్థగా ఉన్న అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్ 26వ మహాసభలు ఆదివారం ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి హెచ్‌ఎంఎస్ నేత, మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడారు. పలు తీర్మానాలు చేసి వాటి సాధనకు కారి్మకవర్గంతో కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి జాగృతితో కలసి పని చేయడానికి ఇటీవల తీసుకు న్న నిర్ణయం మేరకు ఈ సభలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హెచ్‌ఎంఎస్ అనుబంధ వర్కర్స్ యూనియన్ గౌర వ అధ్యక్షురాలిగా ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కాగా, అమెరికా పర్యటనకు వెళ్లిన కవిత సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.