పులకించిన పీపుల్స్ ప్లాజా

రాష్ట్రంలో గతేడాది కంటే రెండు వారాల ముందే విరమణ
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా రాగరంజితమైంది. పూల శోభతో పులకించిపోయింది. బతుకమ్మ ఆట పాటలు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది. మంగళవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ అనిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనిత, నగర గ్రంథాలయ చైర్‌పర్సన్ ప్రసన్న, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు