బాన్సువాడ ఎంసీహెచ్‌కు జాతీయ గుర్తింపు  | Sakshi
Sakshi News home page

బాన్సువాడ ఎంసీహెచ్‌కు జాతీయ గుర్తింపు 

Published Sat, Feb 18 2023 1:36 AM

Kamareddy: National Recognition For Banswada MCH - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్‌) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌ (బీఎఫ్‌హెచ్‌ఐ)‘అందించే ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్‌ (గ్రేడ్‌ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్‌ను పలుమార్లు సందర్శించింది.

అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్‌ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటేషన్‌ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్‌ రికార్డ్‌ సాధించింది. ఈ సర్టిఫికెట్‌ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. 

సీఎం ఆదేశాలతో .. 
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్‌ వర్కర్స్‌‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. 

వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్‌రావు 
బాన్సువాడ ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటే షన్‌ రావడం హర్షణీయమని హరీశ్‌రావు పేర్కొ న్నారు. హాస్పిటల్‌ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement