రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి

సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశి వనగర్ మండలం దగ్గి గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారు లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. అనంతరం సదాశివనగర్ మండల కేంద్రం అటవీ ప్రాంతం శివారులో ఖననం చేశారు. డీఎఫ్‌వో నిఖిత, ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఆర్‌ఎస్‌వో రమేశ్, సెక్షన్ అధికారి ముబాషిర్‌అలీ, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.