ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్: ఎస్తోనియా బృందం | innovation hub in hyderabad | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ : ఎస్తోనియా బృందం

Jul 26 2025 11:20 AM | Updated on Jul 26 2025 12:02 PM

innovation hub in hyderabad

హైదరాబాద్: డిజిటల్ ఆధారిత పరిపాలన,శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్‌తో సంబంధాలను మరింతగా బలపరిచే దిశగా ఎస్తో నియా కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎస్తోనియా రాయబారి హెచ్.ఈ. మాజే లూప్ (H.E. Ms. Marje Luup) నేతృత్వంలోని ఉన్నత స్థా యి ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించింది. ఈ పర్యటనలో వ్యాపార, సాంకేతిక రంగాలలో భాగస్వామ్య అవకాశాలు, ఇన్నోవేషన్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ టెక్నాలజీ, డిజిటల్ పరిపాలన వంటి రంగాలలో సహకారమే లక్ష్యంగా తీసుకుంది. 

ఈ సందర్భంగా ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు, పెట్టు బడి సంస్థ ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలలో ఇన్నోవేషన్, సాంకేతిక పరిజ్ఞా నం, డిజిటల్ పాలన, రోబో టిక్స్, ఏఐ, హెల్త్ టెక్నాలజీ తదితర రంగాలలో సహకారంపై ప్రత్యేకంగా చర్చించారు.మీడియాతో మాట్లా డిన రాయబారి మార్జె లూప్ మాట్లా డుతూ, “భారత్, ఎస్తో నియా రెండూ డిజిటల్ ఇన్నోవేషన్‌కుప్రా ధాన్యతనిచ్చే దేశాలు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కేంద్రంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆవిష్కరణలు ఉన్న వ్యవస్థ లతో ఎస్తో నియాకు సహజ భాగస్వామిగా కనిపిస్తు న్నాయి,” అని పేర్కొన్నారు. ఎస్తో నియా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ దేశంగా గుర్తింపు పొందిందని, భారతదేశ టెక్ కంపెనీలకు యూరప్మా ర్కెట్ ప్రవేశానికి ఇదొ క రాజమార్గం అవుతుందని రాయబారి తెలిపారు. 

ఇరు దేశాల మధ్య విద్యా, పరిశోధన, వ్యాపార రంగాలలో భాగస్వామ్యాలకువిస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.ఈ బృందంలో స్వెన్ ఆలిక్, మేడ్లీ రాహువార్మ్, కాత్రే ఎల్జాస్‌లు కూడా పాల్గొ న్నారు. వీరు హెల్త్ టెక్నాలజీ, సైబర్సెక్యూరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబో టిక్స్ వంటి రంగాలలో నిపుణులు. తాల్టె క్ విశ్వవిద్యాలయం (TalTech),టెక్నోపో ల్ (Tehnopol), ఎస్తో నియన్ ఐటీ & టెలికమ్యూనికేషన్ అసో సియేషన్, ఎయిర్ (AIRE – AI & RoboticsEstonia) లాంటి ప్రముఖ సంస్థ లను ఈ బృందం ప్రతినిధ్యం వహించింది.ఈ పర్యటన ద్వారా భారతదేశంతో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రతో, ఎస్తో నియా మరింత సాంకేతిక, వ్యాపార సంబంధాలనుఅభివృద్ధి చేసేందుకు ఆసక్తిగా ఉందని స్పష్ట మైంది.

ఎస్తో నియా గురించి: 
యూరప్‌దేశాల డిజిటల్‌, స్టార్టప్‌లీడర్ ఎస్తో నియా యూరప్‌లో అత్యంత ఆవిష్కరణాత్మక ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు యూరప్‌లో కంపెనీలు స్థాపించి, నిర్వహించడానికి వీలు కలిగించేలా ఈ-రిజిడెన్సీ (e-Residency)కు ప్రా రంభించిన దేశం. లాభాలపై కార్పొరేట్ పన్ను మినహాయింపు, ఆన్‌లైన్‌లోనే కంపెనీ నమోదు, పూర్తిగా డిజిటల్
పాలన వంటి సదుపాయాలతో ఇది స్టా ర్టప్‌లు, రిమోట్ వ్యాపారాలకు గ్లో బల్ కేంద్రంగా నిలుస్తుంది. ఎస్తో నియాలోనే నాటో సైబర్ డిఫెన్స్ సెంటర్, నాటో డయానా సైన్స్ సెంటర్, EU-LISA (EU యొక్క ఐసీటీ ఏజెన్సీ) వంటి కీలక అంతర్జా తీయ సంస్థ లు ఉన్నాయి. ప్రతి లక్ష జనాభా స్టా ర్టప్‌లు, యూనికార్న్స్ పరంగా యూరప్‌లో తొలిస్థా నంలో నిలిచింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యారంగంలోనూ అగ్రస్థా నంలో ఉంది.ఈయూ, యూరోజోన్ సభ్యదేశంగా ఎస్తో నియా : ఎలాంటి కస్ట మ్స్ అడ్డంకులు లేకుండా యూరోపియన్ మార్కెట్‌కు సులభమైన విధానాలను కల్పిస్తుంది. పారదర్శక చట్ట వ్యవస్థ , తక్కువ అవినీతి స్థా యి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది అంతర్జా తీయ పెట్టు బడిదారులు, వ్యాపారులకు ఆకర్షణీయమైన గమ్యస్థా నంగా నిలుస్తోంది.

రాయబారి గురించి:
హెచ్.ఈ. మార్జే లూప్ 1996లో ఎస్తో నియా విదేశాంగ సేవలో చేరారు. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకి, స్వీడన్‌లోని స్టా క్‌హో మ్‌లో ఎస్తో నియా రాయబార కార్యాలయాల్లో ఆమె ఆర్థిక దౌత్యవేత్తగా, ఉపముఖ్యాధికారిగా సేవలందించారు. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా అభివృద్ధి సహకార విభాగాధిపతిగా, EU అభివృద్ధి సహకార డైరెక్టర్ జనరల్‌గా బాధ్యత నిర్వర్తించారు. 2013 నుండి 2023 వరకు విదేశాంగ మంత్రిత్వశాఖలో పరిపాలనా విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. ప్రస్తు తం ఎస్తో నియా రాయబారిగా భారత్‌లో సేవలందిస్తున్న ఆమె, బంగ్లా దేశ్, నేపాల్, శ్రీలంక దేశాలకు కూడా రాయబారిగా బాధ్యత వహిస్తు న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement