రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు | IMD: Temperature Drops Lightly In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

Jun 5 2022 2:27 AM | Updated on Jun 5 2022 8:30 AM

IMD: Temperature Drops Lightly In Telangana - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. గత రెండ్రోజులుగా కొనసాగిన భగభగలు శనివారం నాటికి కాస్త చల్లబడ్డాయి. కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదు కాగా, మరికొన్ని చోట్ల మాత్రం 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. మరో రెండ్రోజుల తర్వాత వాతావరణం ఇంకా చల్లబడనుంది.

రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియల గరిష్ట ఉష్ణోగ్రత న మోదుకాగా, హైదరాబాద్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీ స్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెం డ్రోజులు రాష్ట్రంలోని ఒకట్రెండు జిల్లాల్లో అక్క డక్క డా వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement