జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు ! | Sakshi
Sakshi News home page

జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !

Published Mon, May 20 2024 3:19 PM

Imd Predicts Monsoon May Touch Telangana From June 8th

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. 

కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు  ఐఎండీ వెల్లడించింది. సోమవారం(మే20) నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. హైదరాబాద్‌ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఈ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం  ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement