గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్  | Hyerabad Cop Viral Dance During Ganesh Visarjan Nimajjan | Sakshi
Sakshi News home page

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్ 

Sep 28 2023 8:24 PM | Updated on Sep 28 2023 8:47 PM

Hyerabad Cop Viral Dance During Ganesh Visarjan Nimajjan - Sakshi

హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ వెంబడి గణేశుడి నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపు భారీగా వర్షం కురిసినా కూడా నిమజ్జనాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఈ సంబరాల్లో ఒక పోలీస్ అధికారి డాన్స్‌తో దుమ్ము రేపారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్నేశ్వరుడు తొమ్మిది రోజులపాటు మన మధ్య కొలువుతీరి ఘనంగా పూజలు అందుకున్నాడు.  నవరాత్రులు  ముగిసిన సందర్భంగా గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరుతున్న వేళ ట్యాంక్ బండ్ చేరుకున్న భక్తులంతా సంబరాల్లో మునిగితేలారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం ఇకేరోజు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నిమజ్జనాలకు తరలివచ్చిన భక్తుల్లో పిల్ల, పెద్ద, యువత తేడా లేకుండా తీన్‌మార్ దరువుకు  ధూందాం డాన్సులేశారు. 

ఇదే సంబరాల్లో ఓ పోలీసాయన కూడా తన్మయత్వంతో చిందులేశారు. ప్రొఫెషనల్ డాన్సర్‌లా ఈయన వేసిన స్టెప్పులకు చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఇంకేముంది మిగతా పోలీసులు కూడా కాసేపు సంబరాల్లో పాలుపంచుకుంటూ సరదాగా డాన్సులు చేశారు. ఈ వీడియో టీవీలో కనిపించిన  కొద్దిసేపటికే మొబైల్ ఫోన్లలో చేరి వైరలయ్యింది.  

ఇది కూడా చదవండి: నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement