భార్య కాల్‌డేటా ఇవ్వలేదని… డెట్టాల్ తాగిన భర్త..! | Hyderabad Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

భార్య కాల్‌డేటా ఇవ్వలేదని… డెట్టాల్ తాగిన భర్త..!

Apr 9 2026 11:52 AM | Updated on Apr 9 2026 12:32 PM

Hyderabad Wife And Husband Incident

హైదరాబాద్: తన భార్య సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను పోలీసులు ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. పెద్దపల్లి జిల్లా గూడెం గ్రామానికి చెందిన ఇటుకల మహేష్‌ (29) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. మాట్రిమోనియా యాప్‌ ద్వారా ఓ యువతిని గత సంవత్సరం వివాహం చేసుకుని జూబ్లీహిల్స్‌లో నివాసముండేవారు. 

ఇటీవల ఇద్దరి మధ్యా గొడవ జరగడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి మహేష్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహేష్‌ తన భార్య కాల్‌డేటా కావాలని ఇన్‌స్పెక్టర్‌ సైదులును అడిగాడు. కాల్‌డేటా ఇవ్వటానికి కుదరదని, భార్యాభర్తల గొడవ కోర్టు ద్వారా కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ద్వారా పరిష్కరించుకోవాలని కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దీంతో పోలీసులు పట్టించుకోవటం లేదని వెంట తెచ్చుకున్న డెట్టాల్‌ తాగబోయాడు. పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement