అత్తకు భారీ షాక్‌.. ఐదేండ్లు జైలు శిక్ష..! | Hyderabad Court sends husband to 5 yrs jail in dowry | Sakshi
Sakshi News home page

అత్తకు భారీ షాక్‌.. ఐదేండ్లు జైలు శిక్ష..!

Apr 29 2026 7:47 AM | Updated on Apr 29 2026 7:47 AM

Hyderabad Court sends husband to 5 yrs jail in dowry

హైదరాబాద్‌: గృహ హింస కేసులో భర్తకు 5 ఏండ్లు, అత్తకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం నాంపల్లిలోని మనోరంజన్‌లో ఉన్న 15వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజి్రస్టేట్‌ కోర్టు జడ్జి డి.అజయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనితాదేశ్‌ముఖ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్‌కు చెందిన షభాన బేగంను అక్టోబర్‌ 10, 2014న చాంద్రాయణ గుట్టకు చెందిన అన్వర్‌పాషా వివాహం చేసుకున్నాడు. వరకట్నం కింద రూ.60 వేలు, 10 తులాల బంగారం, 30 తులాల వెండీ, రూ.5 లక్షల విలువైన వస్తువులను ఇచ్చారు. కొద్దికాలం అనంతరం అదనపు కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులతో రూ.2 లక్షలు ఇచ్చారు. 

మళ్లీ వేధింపులకు గురిచేయడంతో ఆగష్టు 20, 2015లో రాజేంద్రనగర్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎసై బాలునాయక్, ఎన్‌.శ్రేయ విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో చార్జిషిట్‌ను కోర్టులో అందజేశారు. బాధితురాలి తరుఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనితాదేశ్‌ముఖ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన  15వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజి్రస్టేట్‌ కోర్టు ఏపీపీ వాదనలను ఏకీభవిస్తూ నిందితులిద్దరికి శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement