
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో అదనపు సరీ్వసులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మూడు కారిడార్‌లలో ఆఖరి మెట్రో సరీ్వసులు గురువారం రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్‌లలో మాత్రం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తెరిచి ఉంచుతారు. మిగతా స్టేషన్లలో కేవలం ని్రష్కమణ ద్వారాలు మాత్రమే తెరిచి ఉంటాయి.
60 అదనపు బస్సులు....
ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సరీ్వసులను ఏర్పాటు చేయనున్నారు.