శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత | Huge Drugs Seized in Shamshabad Hyderabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Apr 28 2026 8:04 PM | Updated on Apr 28 2026 8:04 PM

Huge Drugs Seized in Shamshabad Hyderabad

(ఫైల్‌ఫోటో)

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సుమారు రూ. 2.15 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచే ఈ డ్రగ్స్‌ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సదరు వ్యక్తి హైడ్రోపోనిక్‌ గంజాయితో పట్టుబడ్డాడు. 

 6.15 కిలోల  ఈ హైడ్రోఫోనిక్‌ గంజాయి విలువ రూ. 2. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఎయిర్‌ ఆసియా విమానంలో బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు దీన్ని 16 సీల్డ్‌ ప్యాకెట్లలో దాచిపెట్టి తెచ్చాడు. 

అంతకుముందు ఏప్రిల్‌ 2వ తేదీన కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టు చేశారు.  అది కూడా బ్యాంకాక్‌ నుంచే వచ్చింది. 25 కిలోల 45 గ్రాముల హైడ్రోఫోనిక్‌ గంజాయి తీసుకువచ్చారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.8.9 కోట్లు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement