కాళేశ్వరం వృథా కాదు.. ఆదా!

Harish Rao Comments On Opposition Over Kaleshwaram Project - Sakshi

మూడేళ్లలో లక్ష కోట్ల విలువైన పంట పండింది.. శాసన మండలిలో మంత్రి హరీశ్‌

యాసంగికి కాళేశ్వరం నీళ్లిస్తాం

ఈనెల చివరి వారంలో అన్నారం.. అక్టోబర్‌ చివరిలో మేడిగడ్డ పంపులు మొదలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయి, పల్లె పల్లెను సస్యశ్యామలం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును విఫలయత్నంగా చూపించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నా యని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా రూ.లక్ష కోట్లు వృధా కావడం కాదని.. మూడేళ్లలో వచ్చిన నీరు, నాలుగు మీటర్లు పెరిగిన భూగర్భ జలాలతో రూ. లక్ష కోట్ల పంట పండిందన్నా రు. మంగళవారం శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో అతివృష్టి– గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు’ అంశంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వల్పకాలిక చర్చను ప్రా రంభించారు. హరీశ్‌తోపాటు మంత్రి పువ్వా డ అజయ్, మండలి సభ్యులు జాఫ్రి, తాతా మధు, కడియం శ్రీహరి, నర్సిరెడ్డి, బండారు ప్రకాశ్‌ మాట్లాడారు. అన్నారం పంప్‌హౌజ్‌ నుంచి ఈ నెలాఖరులో, మేడిగడ్డ నుంచి అక్టోబర్‌ నెలాఖరులో నీటిని లిఫ్ట్‌ చేయడం ప్రారంభిస్తామని హరీశ్‌ ప్రకటించారు.

కాళేశ్వరం పెద్ద ఆస్తి
‘కాళేశ్వరం తెలంగాణకు పెద్ద ఆస్తి. మూడేళ్ల లోనే తక్కువ ఖర్చుతో పూర్తి చేశాం. స్టీల్, సిమెంట్, డీజిల్‌ ధరలు ఇప్పటికి 100 శాతం పెరిగాయి. స్వల్పకాలంలో నిర్మించడంతో లక్ష కోట్లకుపైగా ఆదా చేయగలిగాం’ అని హరీశ్‌ పేర్కొన్నారు. గోదావరికి గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది జూలై 8 –13 మధ్య 29లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని.. ఆ ధాటికి అన్నారం, మేడిగడ్డ 2 పంపుహౌజ్‌లలో నీరు చేరిందని చెప్పారు. ‘ప్రాజెక్టు డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌’లో భాగంగా ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీలే పంపుహౌజ్‌లకు మరమ్మతు చేస్తున్నాయన్నారు.

వరదల్లో బురద రాజకీయాలా?
ఉమ్మడి ఏపీలో 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించామని.. కానీ ఇప్పు డు ప్రతిపక్షాలు వరదల్లో కూడా బురద రాజ కీయాలు చేస్తున్నాయని హరీశ్‌రావు మండిప డ్డారు. ‘‘ఓ కేంద్రమంత్రి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా పారలేదంటారు. మరో కేంద్రమంత్రి కాళేశ్వరం డీపీఆర్‌ ఏదని అంటరు. డీపీఆర్‌ లేదన్న కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ 10 అనుమతులు ఎలా ఇచ్చింది? ఒక్క ఎకరానికీ నీరు రాకపోతే 2021–22లో 2.59 కోట్ల టన్నుల పంట ఎలా పండింది? తెలంగాణ రైతుల పంటను కొనలేమని కేంద్రం చేతులె త్తేసింది కూడా. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం.. ప్రతిపక్షాలు మాత్రం శనీశ్వరంలా దాపురించాయి’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరానికి కేంద్రం ఇచ్చిన అను మతుల పత్రాలను మండలికి చూపించారు.

వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం: పువ్వాడ అజయ్‌
భద్రాచలం చరిత్రలో ఎన్నడూ లేని గోదావరి వరద బీభత్సాన్ని ఈసారి చూసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సత్వర చర్యలు చేపట్టారని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజక్టు వల్ల భద్రాచలానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గోదావరి వరదలను రాజకీయం చేసేందుకు కేంద్రం గవర్నర్‌ను కూడా వాడుకుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వరద నష్టం పరిశీలనకు సీఎం వెళ్తుంటే.. గవర్నర్‌ను భద్రాచలం పంపించి బురద రాజకీయం చేశారే తప్ప రూపాయి సాయం చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఈ నెల 12కు వాయిదాపడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top