Governor Tamilisai Invited TSRTC Union Leaders For Talks - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల ఛలో రాజ్‌భవన్‌.. స్పందించిన గవర్నర్‌ తమిళిసై, చర్చలకు సై!

Aug 5 2023 11:39 AM | Updated on Aug 5 2023 1:42 PM

Governor Tamilisai Invited Tsrtc Union Leaders For Talks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ తమిళిసై వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా?  విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని  మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్‌.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు.

యూనియన్ నాయకులను గవర్నర్‌ చర్చలకు పిలిచారు. యూనియన్ నాయకులు రాజ్ భవన్ రావాలని ఆహ్వానం పంపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement