తెలంగాణభవన్‌లో వేడుకలు.. బంగారు బోనమెత్తిన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ | Governor CP Radha Krishnan Participated in Bonalu Festival | Sakshi
Sakshi News home page

తెలంగాణభవన్‌లో వేడుకలు.. బంగారు బోనమెత్తిన గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

Published Wed, Jul 10 2024 6:15 PM | Last Updated on Wed, Jul 10 2024 6:45 PM

Governor CP Radha Krishnan Participated in Bonalu Festival

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో లాల్‌ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అమ్మవారికి సమర్పించారు.

కాగా, తెలంగాణభవన్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో లాల్‌ దర్వాజ బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇక, వేడుకల్లో భాగంగా ఆయన బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు.

అనంతరం, రాధాకృష్ణ​న్‌ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కడే. భిన్న రూపాల్లో మనం దేవుడికి కొలుస్తాము. అదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనం. బోనాల ఉత్సావాల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది అని కామెంట్స్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement