‘గ్రేటర్‌’ ఫైనల్‌ ఓటింగ్‌ శాతం ప్రకటించిన ఈసీ

GHMC Election 2020: Election Commission Annouce FInal Voting Percentage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బల్దియా ఎన్నికల్లో తుది ఓటింగ్‌ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 149 డివిజన్లలో పోలింగ్‌ జరగగా 46.68 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. అత్యధికంగా కంచన్‌బాగ్‌లో 70.39 శాతం నమోదు కాగా, అత్యల్పంగా 32.99శాతం పోలింగ్‌ యూసప్‌గూడలో నమోదైంది. కాగా గత 20 ఏళ్లలో జీహెచ్‌ఎంసీలో ఇదే అత్యధికంగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. క్రితంసారి ఎన్నికల్లో (2016) 45శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఎన్నిక ఆగిపోయిన ఓల్డ్‌ మలక్‌పేటలో గురువారం రీ-పోలింగ్‌ జరగనుంది.

ఇక ఎన్నికల ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ఉండగా, సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బ్యాలెట్‌ బాక్స్‌లు పోలీసులు బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లలో మూడంచెల భద్రత కొనసాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top