18 ఏళ్లు నిండాయా?  ఓటరుగా నమోదు చేయించుకోండి 

GHMC Commissioner Lokesh Kumar Campaign On Voting Awareness In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు  నమోదు చేసుకోవాలని హైదరాబాద్‌  జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  లోకేశ్‌కుమార్‌ సూచించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలపై ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా తెలియజేయవచ్చన్నారు. పేరు, చిరునామా వంటి వాటిల్లో పొరపాట్లుంటే సరిచేసుకునే వెసులుబాటు ఉందన్నారు.

బుధవారం ఓటరు జాబితా సవరణపై స్వీప్‌ కమిటీ సభ్యులతో లోకేశ్‌కుమార్‌ వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  ఓటరుగా పేరు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి చిరునామా మార్పుల కోసం సంబంధిత ఈఆర్‌ఓను సంప్రదించవచ్చని సూచించారు. ఓటరు నమోదు యాప్‌ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ (ఎన్నికలు) పంకజ పాల్గొన్నారు.

చదవండి:  ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top