మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

Former Mla Gunda Mallesh Health Condition Decline - Sakshi

సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్‌కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్‌కు వెళ్లి మల్లేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్‌ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్‌చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్‌ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top