నాగార్జున సాగర్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌దే

Exit Poll: TRS Will Be In Nagarjuna Sagar MLA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి నాగార్జునసాగర్‌ స్థానాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఆరా, ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేశాయి. పోలైన ఓట్లు ఎవరికి ఎంత శాతం వస్తాయో ఓ అంచనా వేసి చెప్పాయి.

ఆరా: టీఆర్‌ఎస్‌ - 50.48%, కాంగ్రెస్ - 39.93%, బీజేపీ 6.31%
ఆత్మసాక్షి: టీఆర్‌ఎస్‌- 43.5%, కాంగ్రెస్ - 36.5%, బీజేపీ -14.6%

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సయ్య అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఏప్రిల్‌ 17వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఓట్ల శాతం ఆధారంగా చెప్పవచ్చు. ఈ ఎన్నిక మాత్రం టీఆర్‌ఎస్‌కు, జానారెడ్డికి చాలా కీలకంగా మారనుంది. అయితే ఎవరు విజేత అనేది మాత్రం మే 2వ తేదీన తేలనుంది.

చదవండి: తిరుపతిలో వైఎస్సార్‌ సీపీదే హవా
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top