ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం | EV Benefits for Government Staff Minister Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం

Mar 24 2026 9:35 PM | Updated on Mar 24 2026 9:39 PM

EV Benefits for Government Staff Minister Ponnam Prabhakar
  • ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంపెనీల నుండి 10-20 శాతం డిస్కౌంట్
  • కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవి వాహనాలు వినియోగించండి..
  • ఈవీ పాలసీ ప్రభుత్వం రూపొందిస్తే ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే
  • సెక్రటేరియట్‌లో లాంఛనంగా ఉద్యోగులకు ఈవీ వాహనాల ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి  లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు  925.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్‌లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈవి పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై  ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్  వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవి వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు.ఈవి వాహనాలకు  ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో  వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

సీఎస్‌ రామకృష్ణ రావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సీఎస్‌ పేర్కొన్నారు. నగరం లో ఈవిబిబస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.EVS

Advertisement
 
Advertisement
Advertisement