దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి.. ముహూర్తం ఖరారు

Durgam Cheruvu Bridge Inauguration On 19th By KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరంలో మరో పెద్ద బ్రిడ్జి ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్‌ మంటూ ఇట్టే ఆకర్షించే రీతిలో విద్యుత్‌ కాంతుల ఉన్న దృశ్యాలు అందరినీ కట్టి పడేస్తున్నాయనే చెప్పాలి. ( హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి )

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఐటీ కారిడార్‌ను కేబుల్‌ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. 233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‌ మంటోంది. కేబుల్‌ బ్రిడ్జికి రెండు వైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top