యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

Double Bedroom Houses In Flood Water In Yadadri - Sakshi

వరదనీటితో చెరువును తలపిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంగణం

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుండి తెల్లవారుజామున వరకు కురిసిన కుండపోత వర్షానికి ఆలేరు నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు నీటమునిగాయి. రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీట మునిగింది. యాదగిరి పల్లి నుండి యాదగిరిగుట్ట వచ్చే రహదారిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యాదగిరి గుట్ట మున్సిపాలిటీ లోని యాదగిరిపల్లి లో పలు కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. బిక్కేరు వాగు ఉధృతితో కొరటికల్‌-మురిపిరాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.

రంగారెడ్డి: కుండపోత వర్షాలతో రంగారెడ్డి  జిల్లా బాలాపూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాలు ప్రాంతాల్లన్ని జలమయ్యాయి. లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్, సాయి నగర్, మితులా నగర్, కాలనీల్లన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులన్ని తడిసిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top