ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే | Double Bedroom House Scam | Sakshi
Sakshi News home page

ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే

May 21 2026 7:58 AM | Updated on May 21 2026 11:55 AM

Double Bedroom House Scam

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల దురి్వనియోగంపై గృహనిర్మాణ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించకున్నా..ఏళ్లతరబడి తాళాలు వేసి ఉంచినా..ఇతరులకు అద్దెకిచి్చనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఇప్పటికే  రెండుసార్లు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించని వారిపై తుది నోటీసుల అస్త్రం సిద్ధమైంది. చివరి గడువు ముగిసేలోపు వివరణ ఇచ్చి సదరు లబి్ధదారులు ఇళ్లలోకి చేరని పక్షంలో వారి కేటాయింపులను తక్షణమే రద్దు చేసి ఆ నివాసాలను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ గృహాల తాళాలు తెరుచుకుని అసలైన నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రక్రియ సరికొత్త మలుపు తిరుగుతోంది 

గతంలో ఇదీ పరిస్థితి.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రాజెక్టులో భాగంగా..సుమారు 111 ప్రాంతాలలో 68,176 వేల పైచిలుకు గృహాల నిర్మాణాలు పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 63,982 ఇళ్లను అధికారికంగా పంపిణీ చేసింది. ఇక గతంలో ఇతర శాఖల పరిధిలో ఉన్న డబుల్‌ ఇళ్ల ప్రాజెక్టులను ఇప్పుడు గృహనిర్మాణ శాఖ పరిధిలోకి మార్చారు.  

19 వేల కుటుంబాలకు పైనే... 
గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఇటీవల గృహనిర్మాణ శాఖ దృష్టిసారించింది. నగర శివారులోని కొల్లూరులో సుమారు 15,660 ఇళ్లు ఉండగా..ఇక్కడ చాలా ఇళ్లకు తాళం వేసి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల కేటాయింపులు జరిగి రెండేళ్లవుతున్నా లబి్ధదారులెవరూ ఇళ్లల్లో చేరలేదు. వీటిని అన్‌ ఆక్యుపైడ్‌గా గుర్తించారు. రాంపల్లి, దుండిగల్, అహ్మద్‌గూడ, మాన్సాన్‌పల్లి, శంకర్‌పల్లి, నల్లగండ్ల, నార్సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర నివాస సముదాయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హౌసింగ్‌ శాఖ క్షేత్రస్థాయి భౌతిక సర్వే చేపట్టగా..సుమారు 19 వేల మంది లబి్ధదారులు కేటాయించిన ఇళ్లలో నివసించకుండా వాటికి తాళాలు వేసి ఉంచడం, ఇతరులకు అద్దెకు ఇచి్చనట్లు బహిర్గతమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సదరు లబి్ధదారులకు కఠిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వారికి రెండు నోటీసులు జారీ చేయగా, కొందరు స్పందించారు. మూడో నోటీసుకు స్పందించి ఇళ్లలో చేరని పక్షంలో ఆ కేటాయింపులు రద్దు చేసి ఇళ్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement