హడలే‍త్తిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. పొరుగు రాష్ట్రం నుంచి ముప్పు

Delta Plus Variant Spread In Maharashtra - Sakshi

సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయపెడుతోంది. కరోనా నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పొరుగున ఉన్న మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. మహారాష్ట్రకు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు నడుస్తున్న నేపథ్యంలో వైరస్‌ సంక్రమించే అవకాశం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని తనిఖీ కూడా చేయడం లేదని పేర్కొంటున్నారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి మండల కేంద్రంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించి, వారి పూర్తి వివరాలు నమోదు చేసుకునేవారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ– పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గి, కేసుల సంఖ్య స్వల్ప స్థాయికి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారాలు, వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని వార్తలొస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహారాష్ట్రకు రాకపోకలు..
మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌ వేవ్‌ కేసులు విపరీతంగా పెరగడంతో అటువైపు వెళ్లే బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పాటు మండల కేంద్రంలో ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతించేవారు. ప్రస్తు తం కరోనా ఉధృతి సాధారణ స్థాయికి చేరగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సైతం తొలగించారు. మహారాష్ట్రలో మండలానికి చెందిన వారి బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు మునుపటిలా యథావిధి గా పూర్తిస్థాయిలో నడుస్తుండడం వల్ల ప్రతిరోజూ వందల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వ్యాపారాల నిమిత్తం చంద్రాపూర్, నాగ్‌పూర్‌ వరకూ ప్రయాణాలు సాగిస్తుంటారు.

డెల్టా ప్లస్‌ అలజడి.. 
మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్లు, తగు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. ఈ రకం వైరస్‌ ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ల కంటే వేగంగా విస్తరించొచ్చని, మాస్కు లేకుండా పక్క నుంచి వెళ్లినా సోకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మండలం నుంచి మహారాష్ట్రకు అధిక సంఖ్యలో రాకపోకలు సాగుతుండడం, దేశంలోనే మ హారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కావడం వంటి వి ఆందోళన కలిగించే విషయాలు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక చెక్‌పోస్టును తొలగించడంతో విస్తారంగా రాకపోకలు సాగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌తో అతలాకుతలమైన సామన్య ప్రజానీకం కొత్త రకం వేరియంట్‌ ఎక్కడ కమ్ముకుంటుందోనని భయందోళనకు గురవుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తతో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆదేశాలు వస్తే ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేయడంతో     పై అధికారుల ఆదేశాలనుసారం చెక్‌ పోస్టును తొలగించాం. మండలంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. కరోనా నిబంధనలు పాటించని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నాం. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతాం. 

– దీకొండ రమేశ్, ఎస్సై, వాంకిడి 

చదవండి: Delta Plus: 12 రాష్ట్రాలకు డెల్టా ప్లస్‌ వ్యాప్తి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-06-2021
Jun 27, 2021, 04:19 IST
తిరుపతి, అన్నమయ్య సర్కిల్‌: కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య...
27-06-2021
Jun 27, 2021, 04:14 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్‌లు చాలా వస్తున్నాయి.. అంతరించి పోతున్నాయి.. కానీ వైరస్‌ నుంచి మనల్ని మనం...
27-06-2021
Jun 27, 2021, 03:48 IST
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మార్చి నెల నుంచి అన్ని బోధనాసుపత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన సంగతి...
27-06-2021
Jun 27, 2021, 02:45 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో... ఒకటి ఒక కంపెనీ, మరొకటి మరో కంపెనీ (మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ టీకా...
27-06-2021
Jun 27, 2021, 02:33 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఈ కేసులు 12 రాష్ట్రాలకు విస్తరించగా, తమిళనాడులో తొలి...
27-06-2021
Jun 27, 2021, 02:18 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో ఈవారంలో పెంచిన వేగం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగాన్ని...
27-06-2021
Jun 27, 2021, 01:23 IST
జెనీవా: కోవిడ్‌–19 వైరస్‌ డెల్టా వేరియంట్‌ దాదాపు 85 దేశాల్లో వ్యాపించిందని, ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్ల కన్నా ఇది చాలా...
26-06-2021
Jun 26, 2021, 22:48 IST
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏ చిన్న జ్వరం వచ్చినా అది కరోనాయే అనేంత ఆందోళన....
26-06-2021
Jun 26, 2021, 14:03 IST
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సమయంలో  డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి...
26-06-2021
Jun 26, 2021, 12:43 IST
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో పతంకాలన్‌ గ్రామానికి చెందిన కన్వర్లాల్ అనే వ్యక్తి కరోనా టీకాకు భయపడి చెట్టెక్కాడు. వివరాల్లోకి వెళితే.....
26-06-2021
Jun 26, 2021, 10:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,698  కరోనా పాజిటివ్‌...
26-06-2021
Jun 26, 2021, 09:28 IST
న్యూఢిల్లీ: గర్భిణులకు కోవిడ్‌ టీకా వేయించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ...
26-06-2021
Jun 26, 2021, 09:11 IST
సాక్షి బెంగళూరు: డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కోవిడ్‌ నిర్ధారణ...
26-06-2021
Jun 26, 2021, 08:40 IST
కోల్‌కతా: నగరంలో నకిలీ కోవిడ్‌ టీకా క్యాంపుల వివాదం అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వివాదం సృష్టిస్తోంది. ఈ నకిలీ...
26-06-2021
Jun 26, 2021, 08:05 IST
సరిహద్దు జిల్లాల గ్రామాల్లో సాక్షి పరిశీలన
26-06-2021
Jun 26, 2021, 07:30 IST
లండన్‌: కరోనా భయంతో బ్రిటన్‌లో నివసిస్తున్న సుధా శివనాధం తన ఐదేళ్ల కూతురిని చంపుకుంది. తనకు కోవిడ్‌ కారణంగా మరణం...
26-06-2021
Jun 26, 2021, 04:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45...
26-06-2021
Jun 26, 2021, 04:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, వైరస్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)...
26-06-2021
Jun 26, 2021, 02:13 IST
►డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్‌డౌన్‌ సడలించారన్న ఉద్దేశంతో జనం...
26-06-2021
Jun 26, 2021, 01:53 IST
ఆఫ్రికా దేశాల్లో ఈ వేరియెంట్‌తో మూడో వేవ్‌ ఉధృత దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్‌డౌన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top