
నెలరోజులుగా సహజీవనం
యువకుడి రిమాండ్
బంజారాహిల్స్(హైదరబాద్): తాను హాస్టల్‌లో ఉంటున్నానని, నెల రోజులుగా తల్లిదండ్రులను నమ్మించిన ఓ బాలిక తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి గదిలో ఓ అబ్బాయితో ఉన్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలిక (16) ఏడాది క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లిదండ్రులతో గొడవ పడి హైదరాబాద్‌కు వచి్చంది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. హాస్టల్‌లో ఉంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేది.
అయితే ఈ నెల 25న తల్లిదండ్రులకు ఫోన్ చేసి గత నెల రోజులుగా తాను డెలివరీ బాయ్ (19)గా పనిచేస్తున్న యువకుడితో ఫిలింనగర్‌లో ని ఓ గదిలో సహజీవనం చేస్తున్నానని, వారం రోజుల నుంచి సదరు యువకుడు తనను తీవ్రంగా కొడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కుమార్తె చెప్పిన అడ్రస్‌ను వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. మైనర్ బాలికను లోబర్చుకుని సహజీవనం చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.