తెలంగాణలో పెరిగిన క్రైమ్‌ రేట్‌.. గతేడాదితో పోలిస్తే..

Crime Rate Has Increased By 4 Percent In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైం రేట్‌ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయి. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్‌కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోగా,  వారి నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ వివరించారు.

‘‘కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడింది. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాం. 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించాం’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ  ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయి. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2432 పొక్సో కేసులు నమోదు. 2022లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశాం. 19,456 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం’’ అని డీజీపీ వెల్లడించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top