ప్లాస్మాతో ప్రాణం

CP Sajjanar Awareness on Plasma Donation Hyderabad - Sakshi

కోవిడ్‌పై యుద్ధానికి చివరి అస్త్రంగా ప్రయోగం

సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్‌ సెల్‌ 

ఇప్పటివరకు 213 మంది నుంచి ప్లాస్మా సేకరణ  

370 మందికి పునర్జన్మ ప్రసాదించిన వైనం    

అవకాశాన్ని వదులుకోబోమంటున్న దాతలు 

పెరుగుతున్న వైరస్‌ బాధితుల రికవరీ రేట్‌ 

యోధులూ ముందుకు రండి.. విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్‌.. మొన్నటి వరకూ లాక్‌డౌన్‌లో కోవిడ్‌ నియంత్రణపై పూర్తి సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం కోవిడ్‌ బారిన పడి ప్రాణాపాయంతో ఉన్నవారికి ప్లాస్మాను ఇచ్చే దిశగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజూ తానే స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ముందుకొచ్చి ప్రాణాలు నిలిపిన వారిని ప్లాస్మా యోధాతో సత్కరిస్తున్నారు. తొలుత ప్లాస్మా సేకరణ పోలీస్‌ నుంచి ప్రారంభించి ప్రస్తుతం ముందుకు వచ్చే అందరితో సేకరిస్తున్నారు. ఈ విషయమై సజ్జనార్‌ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. కోవిడ్‌ వైరస్‌ను ఓడించి నిలిచిన వారంతా.. ప్లాస్మా దానం చేసి మరో ప్రాణాన్ని నిలబెట్టాలని, ప్లాస్మా ఇచ్చేవారు 94906 17444నుసంప్రదిస్తే అంతా తామే సమన్వయం చేస్తామన్నారు.   

సాక్షి, హైదరాబాద్‌: మనిషి ప్రాణానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు.  సర్వావస్థల్లో, సకల కాలాల్లో అన్నింటికి కంటే ప్రధానమైది అదే. కళ్లెదుటే ఓ నిండు ప్రాణం పోతున్నా.. స్పందించకపోతే మనుషులకు విలువే ఉండదు. అయినా ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇప్పటి వరకు వైద్యులకే ఉండేది. కానీ ‘డెంగీతో నేనూ మరణం చివరి అంచుల వరకూ వెళ్లివచ్చి ప్రస్తుతం ప్రాణ దాతనయ్యా.. ఇప్పటి వరకు మూడుసార్లు ప్లాస్మాను దానం చేశా.. ఈ జీవితానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది’ అని 23 ఏళ్ల పి.ఉదయ్‌కిరణ్‌ గుప్తా  సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరోవైపు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్‌ వైరస్‌తో వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరి అస్త్రంగా ప్లాస్మాను     ప్రయోగించారు. ప్రాణంపై ఆశ వదులుకున్న దశలో ఓ 60 ఏళ్ల వ్యక్తి మళ్లీ రికవరీ అయి వారం రోజుల్లో డిశ్చార్జి అయ్యారు. ఈ తరహాలో గుప్తా పదిహేను రోజుల్లో మూడుసార్లు ప్లాస్మా దానం చేశారు. గుప్తా బాటలో అనేక మందిని నడిపించేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, గాంధీ ఆస్పత్రి, ప్మాస్మా డోనర్స్‌ అసోసియేషన్లు చేస్తున్న కృషితో ‘మిషన్‌ ప్లాస్మా క్లబ్‌’లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. 

కొత్త జీవితానికి నాంది..    
సరైన మందుల్లేని కరోనా వైరస్‌పై వివిధ రకాలుగా యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్లాస్మా పదునైన ఆయుధంగా మారింది. ఏ మందు ప్రయోగించినా ఫలితం రాని సమయంలో ప్లాస్మాను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 36 మంది వద్ద ప్లాస్మా తీసుకుని 25 మందికి కొత్త లైఫ్‌ ఇవ్వగా.. సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఏకంగా స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 213 మంది దాతల నుంచి ప్లాస్మాను సేకరించి 370 మందికి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్‌ వైరస్‌ బారిన పడి కోలుకున్న వెయ్యి మంది వివరాలు సేకరించిన సైబరాబాద్‌ పోలీసులు మరో వైపు ప్లాస్మా కావాల్సిన వారి వివరాలను సైతం ప్రత్యేక సెల్‌లో నమోదు చేసి దాతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ప్లాస్మా ఇచ్చేవారు 50 ఏళ్లు లోపువారై ఉండి, పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధనతో ముందుకు వస్తున్నవారి సంఖ్య 25 శాతానికి దాటడం లేదు. గడిచిన వారం రోజుల్లో ప్లాస్మా ఇచ్చేందుకు ఎవరికి వారే ముందుకు వస్తున్న తీరు ప్లాస్మా అవసరం ఉన్న కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది. 

ప్రాణం విలువ తెలిసింది.. అందుకే   
‘నాకు డెంగీ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్‌ దొరకలేదు. ఒక దశలో మరణం చివరి అంచుల వరకు వెళ్లా.. అయినా బతికిపోయా. ప్రాణం విలువ అప్పుడే తెలిసింది. అందుకే మన చేతుల్లో ప్రాణం పోసే శక్తిని అవసరమైన వారికి ఉపయోగిస్తాం. ఇప్పటికే మూడుసార్లు ప్లాస్మా ఇచ్చా.’     – ఉదయ్‌కిరణ్‌ గుప్తా, ప్లాస్మా దాత, షాద్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-09-2020
Sep 20, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమని వైద్య...
20-09-2020
Sep 20, 2020, 03:08 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది. శనివారం ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రంలో...
19-09-2020
Sep 19, 2020, 21:02 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ...
19-09-2020
Sep 19, 2020, 17:28 IST
వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్‌-19‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు...
19-09-2020
Sep 19, 2020, 16:03 IST
ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు...
19-09-2020
Sep 19, 2020, 15:08 IST
తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్‌ నుంచి థ్రిలింగ్‌ మొదలవుతుంది. ఇక లాక్డ్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్‌...
19-09-2020
Sep 19, 2020, 14:02 IST
ఎందుకు మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ? సకాలంలో చికిత్స తీసుకోవడం వల్లన మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా?
19-09-2020
Sep 19, 2020, 13:50 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పార్లమెంట్‌ సమావేశాలపై తీవ్రంగా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా...
19-09-2020
Sep 19, 2020, 13:33 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మాస్క్‌ను సరిగా...
19-09-2020
Sep 19, 2020, 10:08 IST
న్యూఢిల్లీ : భార‌త్‌తో క‌రోనా విజృంభిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో  93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
19-09-2020
Sep 19, 2020, 04:51 IST
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ...
19-09-2020
Sep 19, 2020, 04:43 IST
మాదాపూర్‌(హైదరాబాద్‌): సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఎస్‌ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్‌ అలీ(57) కరోనాతో...
19-09-2020
Sep 19, 2020, 04:39 IST
లండన్‌: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్‌ వేవ్‌తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో...
19-09-2020
Sep 19, 2020, 04:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారానికి రికవరీ రేటు 85.29...
19-09-2020
Sep 19, 2020, 04:28 IST
► అతని పేరు డాక్టర్‌ శివశంకర్‌ (పేరు మార్చాం). యాదాద్రి జిల్లాలోని ఒక పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌. అతనికి చౌటుప్పల్‌లోనూ ప్రైవేట్‌...
19-09-2020
Sep 19, 2020, 04:14 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత...
19-09-2020
Sep 19, 2020, 03:46 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌...
18-09-2020
Sep 18, 2020, 21:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 38 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా...
18-09-2020
Sep 18, 2020, 17:42 IST
లండన్‌ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకిందా లేదా నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్‌లోకి వస్తోంది.  ఈ పరికరం ద్వారా...
18-09-2020
Sep 18, 2020, 17:35 IST
సాక్షి, అమరావతి: కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top