కోవిడ్‌ తర్వాత.. కొలువులకు వాత?

Coronavirus Effect On Jobs - Sakshi

ప్రపంచాన్ని పలు రకాలుగా వెంటాడి వేధిస్తున్న కోవిడ్‌ సంక్షోభం పూర్తిగా ముగిసే సరికి మరికొంత కాలం పట్టొచ్చునని తెలుస్తూనే ఉంది. కోవిడ్, లాక్‌డౌన్‌ల దెబ్బకు దాదాపు అన్ని రంగాలూ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. భవిష్యత్తులో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఈ కల్లోలం పెను ప్రభావం చూపనున్న నేపధ్యంలో పలు కార్పొరేట్‌ సంస్థలు దీనిపై చర్చలు సదస్సలు నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా భాగస్వామ్యం కలిగిన ఎడ్యుటెక్‌ స్టార్టప్‌.. గ్లోబల్‌ గ్యాన్‌ అకాడమీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌...తాజాగా ఈ అంశంపై ఒక ప్యానెల్‌ డిస్కషన్‌ను నిర్వహించింది. 

ప్రొఫెషనల్‌ ఇమ్యూనిటీ అవసరం..
కరోనా వైరస్‌కు సరైన రక్షణ మన రోగనిరోధక శక్తి. అలాగే వృత్తిపరమైన ఇమ్యూనిటీతోనే మనం ఈ అనిశ్చితిని ఎదుర్కోగలం, నేర్చుకోవడం, నైపుణ్యాలని వృద్ధి చేసుకోవడం అనేవే ప్రొఫెషనల్‌ ఇమ్యూనిటీని పెంచేందుక సహకరిస్తాయని ఈ చర్చ సందర్భంగా గ్లోబల్‌ గ్యాన్‌ అకాడమీ సిఇఒ ఎ.శ్రీనివాస్‌ అన్నారు. అందుబాటులో ఉన్న ఉద్యాగాలకు, అందుబాటులో ఉన్న నైపుణ్యాలకు మధ్య భారీ వ్యత్యాసమే నిరుద్యోగ సంక్షోభానికి కారణమవుతోందన్నారాయన. 

సక్సెస్‌ త్రూ స్కిల్స్‌...
అత్యధిక సంఖ్యలో కళాశాల విద్యార్ధులు , వృత్తి నిపుణులు.. తమ  కెరీర్‌ అభివృద్ధికి సృజనాత్మక వ్యాపార పోకడలకు అవసరమైన పోటీనైపుణ్యాలలో బలహీనంగా ఉన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , బ్లాక్‌ ఛెయిన్‌ వంటి ప్రాధాన్యత  కలిగిన సాంకేతిక అంశాల్లో అవగాహన అందరు వృత్తి నిపుణులలో చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో అన్ని రంగాలకు చెందిన వృత్తి నిపుణులు విజయం సాధించడానికి అవసరమైన ప్రెజెంట్‌ స్కిల్స్‌ ప్రాధాన్యతపై ఈ సదస్సు నిర్వహించారు. క్రిటికల్‌ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటి వంటి అంశాల్లో అవసరమైన ఈ స్కిల్స్‌నే 21వ శతాబ్ధపు స్కిల్స్‌గా  కూడా పేర్కొంటున్నారు. ఈ చర్చ ద్వారా ఫ్యూచర్‌స్కిల్స్‌ అనే ఆలోచనను పాదుకొల్పారు. అదెంత అర్ధవంతమో తెలియజెప్పారు. 

రానున్నది సవాళ్ల కాలం...స్కిల్స్‌తోనే నెగ్గగలం..    
కోవిడ్‌ నేపధ్యంలో ఉద్యోగార్ధులకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎవరైతే ఈ ప్రెజెంట్‌ స్కిల్స్‌ విషయంలో సంసిద్ధంగా లేరో వారు గట్టి  పోటీ ఎదుర్కోనున్నారని సదస్సు అభిప్రాయపడింది. ఇంకా ఈ సదస్సులో వక్తమైన అభిప్రాయల ప్రకారం...గత 12నెలలుగా ప్రతి కార్పొరేట్‌ సంస్థా...యాంత్రీకరణ, ప్రాసెస్‌ ఇంప్రూవ్‌ మెంట్స్‌ ద్వారా ఉత్సాదకతను పెంచుకోవాలనుకుంటున్నాయి. కోవిడ్‌ నుంచి సాధారణ స్థితికి మనం చేరినా.. ఈ పోకడలు కొనసాగి, ఉద్యోగాల సృష్టి మీద ఒత్తిడి పెంచగలవు. అలాగే ఎంట్రప్రెన్యూరల్‌ స్కిల్స్‌ కూడా పెరగాల్సి ఉంది. రానున్న పదేళ్లలో 100 మిలియన్ల ఉద్యోగాలు సృష్టి జరగాల్సి ఉంది. ఇది లక్ష కొత్త వ్యాపారాలు రావాల్సి ఉందని సూచిస్తోంది. కళాశాల విద్యార్ధుల్లో మాత్రమే కాదు అనేకమంది వృత్తి నిపుణుల్లో కూడా.

స్వయం ఉపాధి సామర్ధ్యాలు ఎంటర్‌ప్రెన్యూరల్‌ స్కిల్స్, లీడర్‌ షిప్‌ స్కిల్స్‌ వృద్ధి అవసరం చాలా ఉంది.  విద్యా వ్యవస్థను తప్పుపట్టడం అనేది సమస్యను పరిష్కరించదు. ఫ్రెషర్స్‌తో పాటుగా ఉద్యోగస్తుల్లో కూడా టాలెంట్‌ పెంచే క్రమంలో కార్పొరేట్‌ ప్రపంచం కీలకపాత్ర పోషించాల్సి ఉంది. ఈ క్రమంలో సామర్ధ్యాల పెంపుపై అగ్రగామి కార్పొరేట్‌ సంస్థలతో  కలిసి గ్లోబల్‌ గ్యాన్‌ పనిచేస్తోంది. లైవ్, సెల్ఫ్‌ పేస్డ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా... సిఐఐ స్మార్ట్‌ మేనేజర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్, నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ వంటివి అందిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top