Hyderabad: ఒకే అపార్ట్‌మెంట్‌లో పది మందికి కరోనా | Corona For Ten People in Same Apartment Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: ఒకే అపార్ట్‌మెంట్‌లో పది మందికి కరోనా

Dec 5 2021 6:44 AM | Updated on Dec 5 2021 8:27 AM

Corona For Ten People in Same Apartment Hyderabad - Sakshi

అపార్ట్‌మెంట్‌లో సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ చేస్తున్న సిబ్బంది 

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కోవిడ్‌ కలకలం సృష్టించింది. పీరంచెరువులోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్న పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులంతా భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి..  గేటెడ్‌ కమ్యూనిటీలోని బ్లాక్‌లో ఓ వ్యక్తి  భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. వీరి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కరోనా పరీక్షలు చేశారు. మొత్తం నలుగురికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్య)

మరో బ్లాక్‌లో ఉంటున్న ఆరుగురు కుటుంబ సభ్యులకూ కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరందరినీ ఐసొలేషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని గేటెడ్‌ కమ్యూనిటీ సభ్యులు కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో  శనివారం శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్‌ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్‌ను పరిశీలించి శానిటైజ్‌ చేశారు. అపార్ట్‌మెంట్‌ మొత్తం సోడియం హైపోక్లోరైట్‌ మిశ్రమంతో పిచికారీ చేయించారు. ప్రస్తుతం బాధితులు   హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement