కరోనా సెకెండ్‌ వేవ్‌: ఏం చేద్దాం? ఎలా చేద్దాం?

Corona Second Wave Precautions And Causes Special Story - Sakshi

సాక్షి, హైదారబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌పై ప్రత్యేక కథనం..

ఎప్పుడు పరీక్షలు చేసుకోవాలి? 
లక్షణాలు ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవాలి. 

ఇప్పటివరకు ఉన్న లక్షణాలు: జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన లేక రుచి లేకపోవడం, చలి ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది

కొత్త లక్షణాలు:
 కళ్లు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారడం, విరేచనాలు, తాత్కాలికంగా వినికిడి శక్తి కోల్పోవడం
►  పాజిటివ్‌ రోగితో అత్యంత సమీపంలో ఉండటం, ఆరడుగుల దూరంలో కూడా కనీసం 15 నిమిషాలు కలసి ఉంటే పరీక్ష చేయించుకోవాలి.

ఏ పరీక్ష చేయించుకోవాలి?
►  ఆర్‌టీపీసీఆర్‌ అత్యంత కీలకమైన నిర్ధారణ పరీక్ష. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ అప్పటికప్పుడు నిర్ధారణ చేసుకునే పరీక్ష. ర్యాపిడ్‌ టెస్టులో పాజిటివ్‌ ఉంటే కరోనా నూటికి నూరు శాతం నిర్ధారణ అయినట్లే. మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి్సన అవసరం లేదు. ర్యాపిడ్‌లో నెగెటివ్‌ వచ్చి 
లక్షణాలుంటే, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌
అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే దీనికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దీనికి మరణాలను ఆపగలిగే శక్తిలేదు.
ఎప్పుడు వాడాలి?
►  ఆర్‌టీపీసీఆర్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి
► రక్తంలో ఆక్సిజన్‌ సంతృప్త శాతం 90 శాతం ఉండి, వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు. 
► ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడు 
► పైన పేర్కొన్న పరిస్థితులున్నప్పుడు మొదటి 9 రోజుల్లోనే రెమిడెసివిర్‌ ఇవ్వాలి. ఎందుకంటే వైరస్‌ లోడ్‌ రెట్టింపయ్యే  అవకాశం ఉంది. దీనివల్ల త్వరగా  కోలుకోవడానికి అవకాశం ఉంది. 

మందులు, చికిత్స విధానాలు...
పావిపిరావిర్‌ మాత్ర
అత్యవసర వాడకానికి మాత్రమే దీనికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దీనికి మరణాలను ఆపగలిగే శక్తిలేదు. 
ఎప్పుడు వాడాలి..
► జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్నప్పుడు 
►  18–75 ఏళ్ల మధ్య వారికి మాత్రమే వాడాలి
►  ఈ మాత్ర వాడకంపై జాతీయ స్థాయిలో ఎలాంటి సిఫార్సులు లేవు. కానీ డాక్టర్ల సూచనల మేరకు 72 గంటల్లోగా ఇస్తే వైరల్‌ లోడ్‌ తగ్గిస్తుంది.

కరోనా దశలు...
మొదటి దశ: హోం క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌ వార్డు..
►  లక్షణాలు లేకుండా కరోనా బారినపడినవారు. 
► కొద్దిగా జ్వరం, బలహీనంగా ఉండటం, కండరాల నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, వాంతులు, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపునొప్పి, విరేచనాలు
రెండో దశ: ఆసుపత్రిలో సాధారణ లేదా ఆక్సిజన్‌పై చికిత్స
► జ్వరం తగ్గకపోవడం, దగ్గు నిరంతరాయంగా ఉండటం, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో ఏదో సమస్యను గుర్తించడం.
మూడో దశ: ఐసీయూ..
► తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92 కంటే  తక్కువగా ఉండటం. 
►   అత్యవసర క్రిటికల్‌ కేర్, అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్, లో బీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కిడ్నీ సమస్యలు  తలెత్తడం.

ప్లాస్మాతో చికిత్స...
అత్యవసర వాడకానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది కూడా ట్రయల్‌ దశలో ఉంది. ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడాలి.
ఎప్పుడు చేయాలంటే?
►  18 ఏళ్లు పైబడిన వారికే.
►  జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకునే స్థితి నిమిషానికి 35 ఉన్నప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90 కంటే తక్కువ ఉన్నప్పుడు. 
►  ప్లాస్మా చికిత్స వల్ల కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉంది. దీన్ని వాడాలా వద్దా డాక్టర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

నివారణే అసలైన మార్గం..
► కోవిడ్‌కు సంబంధించిన చికిత్స విధానాలన్నీ ట్రయల్స్‌కు సంబంధించినవే. 
► కోవిడ్‌కు ఎలాంటి మందు లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం.
► మాస్క్‌లు ధరించాలి. చేతులు శుభ్రపరుచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. 
► కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు నిర్ణీత సమయంలో తీసుకోవాలి. 

చదవండి: కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 16:30 IST
ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో...
06-05-2021
May 06, 2021, 15:23 IST
సాక్షి, మియాపూర్‌: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
06-05-2021
May 06, 2021, 14:06 IST
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు...
06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 09:59 IST
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
06-05-2021
May 06, 2021, 05:27 IST
పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా...
06-05-2021
May 06, 2021, 05:24 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్‌ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో...
06-05-2021
May 06, 2021, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా...
06-05-2021
May 06, 2021, 05:17 IST
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల...
06-05-2021
May 06, 2021, 04:33 IST
కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి...
06-05-2021
May 06, 2021, 02:54 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి...
06-05-2021
May 06, 2021, 01:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో...
06-05-2021
May 06, 2021, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top