నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కేరళ వెళ్లారు. ఆయన మంగళవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


